ఈ-ఆఫీస్ సేవలు మరింత విస్తృతం

by  |
ఈ-ఆఫీస్ సేవలు మరింత విస్తృతం
X

దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వ కార్యకలాపాలు మరింత సులభంగా, పారదర్శకంగా నిర్వహించడానికి ప్రభుత్వం ఇటీవల ఈ-ఆఫీస్‌ను ప్రారంభించింది. తాజాగా ఈ సేవలను మరింత విస్తృతం చేసింది. మరో 8 శాఖలు, 2 శాఖాధిపతుల కార్యాలయాల్లో ఈ-ఆఫీస్‌ ను ప్రారంభించారు.

వైద్య ఆరోగ్య, ప్రణాళిక, కార్మిక, బీసీ సంక్షేమం, హోం, ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ సంక్షేమం, గిరిజన, పీసీబీ, వ్యవసాయ శాఖ కమిషనర్‌ కార్యాలయాల్లో ఈ-సేవలను బీఆర్కే భవన్‌ నుంచి సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సేవలు మరింత పారదర్శకంగా అందించేలా ఈ-ఆఫీస్ ఉంటాయన్నారు. దీని ద్వారా ఎక్కడి నుంచైనా సమర్థమైన పాలనను అందించొచ్చని తెలిపారు.


Next Story