- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దశలవారీగా రోడ్ల నిర్మాణాలు పూర్తి చేయండి: సీఎస్
దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ సిటీలో మిస్సింగ్ రోడ్ల పనులను దశల వారీగా పూర్తిచేసి ట్రాఫిక్ సమస్యను తగ్గించాలని సీఎస్ సోమేష్ కుమార్ సూచించారు. మూసీ నది వెంట ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బ్రిడ్జిల నిర్మాణం కోసం స్ధలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. బీఆర్‌కే భవన్‌లో సీఎస్ అధ్యక్షతన హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ బోర్డు డైరెక్టర్స్ 12వ వార్షిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ హెచ్‌ఆర్‌డీఎల్ ద్వారా చేపడుతున్న మిస్సింగ్ లింక్ ప్రాజెక్టుల పనులను ప్రణాళికాయుతంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మొదటి దశ కింద రూ.313.65కోట్లతో 37మిస్సింగ్ లింక్ పనులను చేపట్టగా 23పనులు వివిధ దశలో ఉన్నట్టు వివరించారు. హైదరాబాద్ నగరంలో హెచ్‌ఆర్‌డిఎల్ ద్వారా మిస్సింగ్ లింక్‌రోడ్ల నిర్మాణం ద్వారా మంచి కనెక్టివిటీ ఏర్పడినందుకు సంబంధిత అధికారులను సీఎస్ అభినందించారు.