Bitcoin: 50 శాతానికి పైగా పతనమైన బిట్‌కాయిన్!

by Harish |   ( Updated:2021-05-20 03:42:31.0  )
Bitcoin
X

దిశ, వెబ్‌డెస్క్: అత్యంత వేగంగా దూసుకెళ్లిన క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ అంతే వేగంగా నేలకు దిగజారింది. ఫిబ్రవరిలో ప్రపంచ దిగ్గజ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా బిట్‌కాయిన్‌లో తన పెట్టుబడిని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ దీనిపై వెనక్కి తగ్గడంతో బిట్‌కాయిన్ భారీగా నష్టపోయింది. దీంతో పాటు చైనా పీపుల్స్ బ్యాంకు కూడా క్రయ, విక్రయాల్లో డిజిటల్ కరెన్సీల వినియోగాన్ని నిషేధిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఈ పరిణామాలతో బిట్‌కాయిన్ విలువ ఏకంగా 30 శాతం కుప్పకూల 31,000 డాలర్లకు పడిపోయింది. దీంతో బిట్‌కాయిన్ మార్కెట్ క్యాప్ 500 బిలియన్ డాలర్లు ఆవిరయ్యాయి. ఎలన్ మస్క్ వ్యాఖ్యలతో బిట్‌కాయిన్‌తో పాటు ఇతర క్రిప్టో కరెన్సీలు కూడా పతనమయ్యాయి. డొజికాయిన్ 45 శాతం, ఎథెరియం 40 శాతానికి పైగా నష్టపోయాయి. ఏప్రిల్‌లో 64,870 డాలర్ల వరకు చేరుకున్న బిట్‌కాయిన్ ఈ ప్రతికూల పరిణామాలతో 50 శాతానికి పైగా నష్టపోయింది.

Advertisement

Next Story

Most Viewed