సింగపూర్ నుంచి భారత్‌కు నాలుగు క్రయోజనిక్ కంటెయినర్లు..

by Shamantha N |
సింగపూర్ నుంచి భారత్‌కు నాలుగు క్రయోజనిక్ కంటెయినర్లు..
X

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం సింగపూర్ నుంచి నాలుగు క్రయోజనిక్ కంటెయినర్లను శనివారం మనదేశానికి తీసుకువచ్చింది. భారత వాయు దళానికి చెందిన సీ17 విమానం సింగపూర్ నుంచి సాయంత్రం 4.30 గంటల ప్రాంతలో పశ్చిమ బెంగాల్‌లోని పానాగఢ్ ఎయిర్‌బేస్‌లో నాలుగు క్రయోజనిక్ కంటెయినర్లతో ల్యాండ్ అయింది. ఈ కంటెయినర్‌లలో లిక్విడ్ ఆక్సిజన్‌ను స్టోర్ చేయవచ్చు. శుక్రవారం నుంచి భారత వాయు దళం వివిధ దేశాల నుంచి ఖాళీ ఆక్సిజన్ ట్యాంకర్లు, కంటెయినర్లను మనదేశానికి తరలిస్తున్నాయి. దేశంలోని ఫిల్లింగ్ స్టేషన్‌లకు చేరుస్తున్నాయి. తద్వారా పంపిణీ వేగవంతమయ్యేందుకు దోహదపడుతున్నాయి.

హాంకాంగ్ నుంచి 800 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు..

స్పైస్ జెట్‌కు చెందిన స్పైస్ ఎక్స్‌ప్రెస్ శనివారం హాంకాంగ్ నుంచి 800 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను భారత్‌కు తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ యూజ్ కోసం వీటిని తరలించింది. సాయంత్రం 7 గంటలకు కోల్‌కతాకు చేరిన ఈ కాన్సంట్రేటర్లు తర్వాత ఢిల్లీకి చేరాయి. త్వరలో ఇతర దేశాల నుంచీ మరో 10వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను మనదేశానికి తీసుకువచ్చే యోచనలో ఉన్నట్టు స్పైస్ జెట్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ వెల్లడించారు.

Advertisement

Next Story