- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఓ మంచి పని చేసిన సీఆర్పీఎఫ్ జవాన్లు
by Sridhar Babu |

X
దిశ, కరీంనగర్: కరోనా కారణంగా లాక్ డౌన్ కొనసాగుతున్నందున సామాన్య ప్రజలు, ఇతరులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున కొంతమంది దాతలు వారికి తమకు తోచిన విధంగా సాయం చేస్తూ తమ మానవీయతను చాటుతున్నారు. నేడు సీఆర్పీఎఫ్ జవాన్లు కూడా పేద ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. మారుమూల మండల ప్రజలకు సీఆర్పీఎఫ్ జవాన్లు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న పల్లె జనానికి బాసటగా నిలవాలని భావించిన పారామిలటరీ బలగాలు వారికి నిత్యవసరాలను పంపిణీ చేశాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పల్మెల మండలంలోని పేదలకు వీటిని అందజేచేశారు. మేడగడ్డలోని 58వ బెటాలియన్ కమాండర్ నజీర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వాటర్ ట్యాంక్ లు, వంట సామాగ్రిని అందజేశారు. పల్మెల ఎస్సై శ్యాం రాజ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Next Story