ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. వరంగల్‌లో మోహరించిన సీఆర్ఫీఎఫ్ బలగాలు

by Shyam |
CRPF forces
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లో బీజాపూర్‌లో సీఆర్పీఎప్ జవాన్లకు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్ కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌లో దాదాపు 25 మందికిపైగా జవాన్లు మృతిచెందారు. దీంతో కేంద్రం అప్రమత్తం అయ్యింది. ఈ క్రమంలోనే అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా పరిధిలోని గోదావరి పరివాహక ప్రాంతంలో సీఆర్ఫీఎఫ్ బలగాలు భారీగా మోహరించాయి. ఛత్తీస్ ఘడ్‌ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్ నుంచి గోదావరి ఇవతలి ఒడ్డుకు వస్తారన్న అనుమానంతో కూంబింగ్ కొనసాగుతోంది. భూపాలపల్లి, ములుగు జిల్లా ఏజెన్సీని భద్రతాబలగాలు జల్లెడపడుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed