‘వానకాలం, యాసంగి అనాలి’

by Shyam |

తెలంగాణలో పంటకాలాల పేర్ల మార్పు

దిశ, న్యూస్ బ్యూరో :

తెలంగాణలో పంటల కాలాల పేర్లలో మార్పు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రికార్డుల్లో రాస్తున్న ఖరీఫ్, రబీ పదాలు చదువుకున్నవారిని కూడా గందరగోళానికి గురిచేసేలా ఉన్నాయని.. వాటి స్థానంలో ఇకపై వానకాలం, యాసంగి పంటలని పేర్కొనాలని మంత్రి నిరంజన్ రెడ్డి శనివారం తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వివరించారు. శాఖా పత్రాల్లోనూ సీజన్లను అదే విధంగా రాయాల్సిందిగా.. ఇప్పటికే వ్యవసాయ, ఉద్యానవన శాఖలు, యూనివర్సిటీలు, కార్పొరేషన్లకు సూచించామని మంత్రి వెల్లడించారు.

Tags: Rabi, Kharif, Telangana, Departmental records, KCR

Advertisement

Next Story

Most Viewed