ganja Seiz : 57.56 కేజీల గంజాయి పట్టివేత

by Sridhar Babu |
ganja Seiz : 57.56 కేజీల గంజాయి పట్టివేత
X

దిశ, భద్రాచలం : ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఖమ్మం అధికారుల ఆధ్వర్యంలో ఎస్టీఎఫ్ హైదరాబాద్, డీటీఎఫ్ కొత్తగూడెం, భద్రాచలం ఎస్ హెచ్ ఓ సంయుక్త ఆధ్వర్యంలో రూట్ వాచ్ లో భాగంగా భద్రాచలం పట్టణంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా గంజాయి తరలిస్తూ స్కోడా కారు పట్టుబడింది. ఎక్సైజ్ అధికారులను చూసి ఓ వ్యక్తి పారిపోగా మరో వ్యక్తి అధికారులకు పట్టుబడ్డాడు. 57.56 కేజీలు గంజాయి తో పాటు కారు, సెల్ ఫోను అధికారులు సీజ్ చేశారు. వీటి విలువ రు. 3,27,000 ఉంటుందని అధికారులు తెలిపారు. పట్టుబడ్డ వ్యక్తిపై కేసు నమోదు చేసి జైలుకు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed