- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి

X
దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మరోసారి తుపాకుల మోత దద్దరిల్లింది. మంగళవారం తాడిమెట్ల అటవీ ప్రాంతంలో భద్రతాదళాలు, మావోయిస్టులకు మధ్య భీకర ఎన్ కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు కూంబింగ్‌ను ముమ్మరం చేశాయి. కాగా, మావోయిస్టుల ఉన్నారన్న విశ్వసనీయ సమాచారంతో భద్రతా దళాలు దండకారణ్యంలో కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించిన అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story