- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
టాటా ఏస్‌ను ఢీకొట్టిన భారీ కంటైనర్.. ఎనిమిది మందికి తీవ్ర గాయాలు

X
దిశ, వెబ్‌డెస్క్: టాటా ఏస్‌ను కంటైనర్ ఢీకొట్టిన ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ పరిధిలోని నందిపాడు బైపాస్ రోడ్డులో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. టాటా ఏస్ వాహనంలో 12 మంది కలిసి నల్లగొండ నుంచి నందిపాడు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే టాటా ఏస్ బైపాస్ రోడ్డులోని స్పీడ్ బ్రేకర్ల వద్దకు రాగానే వెనుక నుంచి ఓ భారీ కంటైనర్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Next Story