మహిళ అధికారి హత్య కేసులో కొత్తకోణం.. ఇంట్లోకి వచ్చిన డ్రైవర్ ఆమె ఒంటరిగా ఉందని.. (వీడియో)

by Nagaya |   ( Updated:2023-11-11 16:33:19.0  )
మహిళ అధికారి హత్య కేసులో కొత్తకోణం.. ఇంట్లోకి వచ్చిన డ్రైవర్ ఆమె ఒంటరిగా ఉందని.. (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: కె.ఎస్ ప్రతిమ... మైనింగ్ మాఫియాను అరికట్టడానికి సీరియస్‌గా పనిచేసిన డైనమిక్ ఆఫీసర్. కర్ణాటకలో గనులు, భూ విజ్ఞాన శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా చేస్తున్న కె.ఎస్ ప్రతిమ మర్డర్ కర్ణాటక ప్రభుత్వాన్ని ఒక్కసారిగా కల్లోలం చేసింది. కరుడుగట్టిన మాఫియా డాన్లకు చెంపపెట్టుగా అవినీతిని అడ్డుకుంటూ విధులు నిర్వహించే సీరియస్ ఆఫీసర్ కె.ఎస్ ప్రతిమ మొదటగా రామానగర్ జిల్లాలో సీనియర్ జీయోలజిస్ట్‌గా, డిప్యూటీ డైరెక్టరుగా పనిచేసేవారు. అక్కడ ఆమె అనుమతులు లేకుండా జరుగుతున్న మైనింగ్ అక్రమాలను చాల వరకు క్లోజ్ చేయించారు. ఒక్కసారి బరిలోకి దిగిందంటే అవతలి వ్యక్తి ఎంత పలుకుబడి ఉన్నవారైనా ఆమెను ఎదిరించి ఇల్లీగల్ మైనింగ్ చేయలేరు. ఆ తర్వాత ప్రతిమ బెంగళూరుకు ట్రాన్స్ఫర్‌పై మీద వెళ్ళింది.

తన భర్త పిల్లలు చదువు, ఉద్యోగం రీత్యా తీర్థనహెల్లి ఊళ్ళో ఉంటూ ప్రతివారం బెంగళూరులో ఉంటున్న ఈవిడను కలుస్తారు. గత 5 ఏళ్లుగా బెంగళూరులో ప్రతిమ దొడ్డకలిసెంద్ర - గోకుల్ అపార్టుమెంటులోనే నివాసం ఉంటూ విధులు నిర్వహిస్తుంది. ప్రతిరోజు తన భర్త, పిల్లలతో పటు తన సోదరుడు ప్రతీక్‌తో మాట్లాడటం అలవాటు. అయితే రోజులాగే నవంబర్ 4వ తేదీన కూడా ఆఫీసుకు వెళ్లి సాయంత్రం 8 గంటలకు ఇంటికి వచ్చింది. డ్రైవర్ ఆమెను ఇంటి వద్ద దింపేసి, కార్ కీస్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆమె తన ఫ్లాట్లోకి వెళ్ళిపోయింది. అయితే కాసేపటి తర్వాత ఆమె సోదరుడు అలవాటుగా ఆమెకు కాల్స్ చేయటంతో ఎలాంటి స్పందన రాలేదు. టెన్షన్ పడిన ప్రతీక్ కింది ఫ్లాట్ వాళ్లకు కాల్ చేసి తమ సోదరి ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు ఒకసారి చూడండి అని అడగడంతో వాళ్ళు వెళ్లి చూశారు. అప్పటికే రక్తపు మడుగులో విగత జీవిగా పడి ఉన్న ప్రతిమను చూసి పొరుగు వారు పోలీసులకు, కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేశారు.

మొదటగా దీన్ని రాజకీయ హత్యగానే చూసినా దర్యాప్తు మలుపు తిరిగి అసలు హంతకుడు బయటపడ్డాడు. కొన్నిరోజుల క్రితం ప్రతిమ సొన్నపహళ్లి టంకర క్వారీ వద్ద సోదాలు జరిపి ప్రభుత్వానికి చెందిన 4 ఎకరాల 5 గుంటల భూమిలో అక్రమంగా జరుగుతున్న మైనింగ్‌ను అడ్డుకున్నారు. అందులో నిందితులుగా ఒక ఎమ్మెల్యే, ముగ్గురు వ్యక్తులు బయటపడ్డారు. అయితే వాళ్లే ఈ హత్య చేశారని భావించారంతా. కానీ వారే కాకుండా ఈ హత్యలో ప్రతిమ మాజీ కారు డ్రైవర్ కిరణ్ ఉన్నట్లు తేలింది. కిరణ్ సమయానికి రాకపోవటం, ఆవిడ చేయబోయే సోదాలను ముందుగానే మైనింగ్ వారికి చెప్పి అక్రమాలకు తావివ్వటం చేసేవాడు. ఈ కారణం చేత ఆవిడ అతన్ని తీసేసింది. నవంబర్ 4వ తేదీన కిరణ్ వచ్చి మళ్ళీ తనను పనిలోకి తీసుకోవాలని పట్టుబట్టాడు. ఆమె ససేమిరా అనడంతో చాకుతో పొడిచి పారిపోయాడు. దీంతో తీవ్రగాయాలపాలైన ఆమె రక్తస్రావమై ప్రాణాలు పోయాయి.

బెంగళూరుకు 200 కిమీ దూరంలో బంధువుల ఇంట్లో తలదాచుకున్న కిరణ్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా దొరికిపోయి తప్పు ఒప్పుకున్నాడు. అంతటితో కథ ఓ కొలిక్కి వచ్చింది. ఎవరిని నమ్మడానికి లేని ఈ రోజుల్లో ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని బతకాల్సి వస్తుంది.

Advertisement

Next Story

Most Viewed