అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి..

by Sumithra |
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి..
X

దిశ, పర్వతగిరి : మండలంలోని అన్నారం పెద్ద తండాకు చెందిన భూక్య గమ్మి (55) అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో పర్వతగిరి పోలీస్ స్టేషన్ లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. మృతి చెందిన గమ్మి కూల్ డ్రింక్ తాగిందని అందులో ఎవరో కావాలని విషం కలిపారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలిని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ లోని ఎంజీఎం హాస్పిటల్ కి తరలించారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story