రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి..

by Kalyani |
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి..
X

దిశ, తూప్రాన్ : రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన బైక్ ఢీకొనడంతో మహిళా అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయిన ఘటన మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై సుభాష్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం… రామాయపల్లి గ్రామానికి చెందిన కటికల రేణుక సమీపంలో గల ఇండస్ మెడికేర్ పరిశ్రమలో గత కొన్ని రోజులుగా పని చేస్తుంది. రోజు లాగే శనివారం ఉదయం గ్రామ చౌరస్తా వద్ద రోడ్డు దాటుతుండగా మేడ్చల్ నుండి తూప్రాన్ వైపు వెళ్తున్న పల్సర్ బైక్ ఢీకొనడంతో మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed