- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని మహిళ ఆత్మహత్య
by Shiva |

X
దిశ, జగిత్యాల రూరల్ : ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని తాటిపళ్లిలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన బొద్దుల సరోజన (50) కొంతకాలంగా పక్షవాతం, నరాల బలహీనతతో నాలుగేళ్లుగా మంచానికే పరిమైంది. దీంతో జీవితంపై విరక్తి కలిగి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటి నుంచి పొగలు, పెద్దఎత్తున మంటలు రావడంతో ఇంటి పక్కన ఉండేవారు కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. అప్పటికే సరోజన పూర్తిగా కాలిపోయింది. మృతురాలు భర్త ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Next Story