మానవత్వం మంటకలిసిన వేళ.. కళ్లు తెరవని శిశువు ఖననం

by Sridhar Babu |
మానవత్వం మంటకలిసిన వేళ.. కళ్లు తెరవని శిశువు ఖననం
X

దిశ, ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండలంలో మానవత్వం మంటకలిసింది. కళ్లు తెరవని శిశువును ఖననం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళి తే.. ఎల్లారెడ్డిపేట మండలంలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన యువతి ఓ యువకుడిని ప్రేమించి చనువుగా మెదిలింది. దీంతో ఆ యువకుడు యువతిని పెళ్లి చేసుకుం టానని ప్రలోభాలకు గురి చేసి గర్భవతిని చేశాడు. తీరా పెళ్లి చేసుకోనని చెప్పడంతో పాటు గర్భంలోని శిశువుతో తనకు సంబంధం లేదని చెప్పాడు. దాంతో బాధితురాలు ఎల్లారెడ్డిపేట పోలీసులను ఆశ్రయించింది. యువకుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. గర్భవతి అయిన యువతికి, ఆమె కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ నిర్వహించి యువతి ప్రసవించగానే తమ దృష్టికి తీసుకు రావాలని పోలీసులు వారికి ఆదేశించారు.

ఇటీవల ఆ యువతి కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు యువతి ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీశారు. కానీ యువతి ఆడ శిశువుకు జన్మనిచ్చిందని ఆ పసికందును సిరిసిల్ల మానేరు వాగులో ఖననం చేశామని చెప్పారు. దీంతో రంగప్రవేశం చేసిన ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గౌడ్, మండల తహసీల్దార్ బోయిని రాంచందర్ ఖననం చేసిన మానేర్ వాగుకు వెళ్లి సిరిసిల్ల మున్సిపల్ సిబ్బందితో మృత శిశువును బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించి పలు రకాల శాంపిల్స్ సేకరించారు. డీఎన్ఏ టెస్ట్ కు పంపించారు. తహశీల్దార్ రాంచందర్ వెంట మండల రెవెన్యూ ఇన్​స్పెక్టర్ సంతోష్, మున్సిపల్ సిబ్బంది, సిరిసిల్ల ఏరియా ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Next Story