బర్త్ సర్టిఫికెట్ కోసం రూ.15000 డిమాండ్.. ఏసీబీకి పట్టుబడిన వీఆర్వో

by Javid Pasha |
బర్త్ సర్టిఫికెట్ కోసం రూ.15000 డిమాండ్.. ఏసీబీకి పట్టుబడిన వీఆర్వో
X

దిశ, నెల్లూరు సిటీ: జనన ధ్రువీకరణ పత్రం కోసం ఓ వ్యక్తి నుంచి పదివేల రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలవేసి పట్టుకున్నారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మంగళవారం చోటుచేసుకుంది. ఆత్మకూరు మండలం దేపూరుకు చెందిన రావిళ్ళ వెంకటేశ్వర్లు తన ఇద్దరు కుమారుల బర్త్ సర్టిఫికెట్ కోసం వీఆర్వో మాల్యాద్రిని ఆశ్రయించాడు. సర్టిఫికెట్ ఇచ్చేందుకు వీఆర్వో మాల్యాద్రి గత కొద్ది రోజులుగా రావిళ్ళ వెంకటేశ్వర్లు ను తిప్పుతున్నాడు. సర్టిఫికెట్ల కోసం 15 వేల రూపాయలు విఆర్ఓ డిమాండ్ చేశాడు. దీంతో వెంకటేశ్వర్లు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.

ఏసీబీ అధికారుల సూచనల మేరకు ఆత్మకూరు పట్టణంలోని ఓ బ్యాంకు సమీపంలో విఆర్వో మల్యాద్రికి వెంకటేశ్వర్లు పదివేల రూపాయలు ఇస్తుండగా ఏసీబీ డిఎస్పి మోహన్ ఆధ్వర్యంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. లంచావతారం అయిన వీఆర్వో మల్యాద్రిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడంలో ఏసీబీ డీఎస్పీ మోహన్, సీఐ ఆంజనేయ రెడ్డి బృందం సఫలీకృతమైంది. రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన విఆర్వో మాల్యాద్రిని అరెస్టు చేశారు.

Advertisement

Next Story

Most Viewed