పోలీసులపై గ్రామస్థుల మూకదాడి

by M.Rajitha |
పోలీసులపై గ్రామస్థుల మూకదాడి
X

దిశ, వెబ్ డెస్క్ : పోలీసులపై ఓ గ్రామానికి చెందిన ప్రజలంతా మూక దాడికి పాల్పడిన ఘటన ఉత్తర ప్రదేశ్ (Utthar pradesh) లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యూపీలోని మొరాదాబాద్(Moradabad) కు చెందిన సోనూ అనే వ్యక్తి మైనింగ్ పనులు నిర్వహిస్తుంటాడు. అయితే సోనూ మైనింగ్ కార్యకలాపాలకు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా సాగిస్తున్నాడాని గుర్తించిన పోలీసులు అతన్ని పట్టుకునేందుకు వెళ్లారు. పోలీసుల రాకను గమనించిన సోనూ ట్రాక్టర్ తో సహ పారిపోవడానికి ప్రయత్నించాడు. పోలీసుల చేజింగ్ లో అతను ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ పై నుండి పడిపోయి, అక్కడిక్కడే మరణించారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు పోలీసుల వల్లే సోనూ మరణించాడని ఆరోపిస్తూ.. వారిపై రాళ్ళు విసిరుతూ, మూక దాడికి తెగబడ్డారు. తీవ్ర గాయలైన పోలీసులు అక్కడి నుండి పరుగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారు. అనంతరం సోనూ మరణానికి కారకులైన పోలీసులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ శవంతో సహ ఠాకూర్ ద్వారా - జస్పూర్ రహదారిపై ధర్నాకు దిగారు. పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకొని వారికి నచ్చజెప్పారు. ఈ ఘటనలో నలుగురు పోలీసులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.


Advertisement

Next Story