వామ్మో గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా..అయితే వెంటనే ఇది చూడండి!

by Aamani |
వామ్మో గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా..అయితే వెంటనే ఇది చూడండి!
X

దిశ,కోదాడ : కోదాడలో ప్రైవేట్ గోల్డ్ లోన్ కంపెనీలలో బంగారంపై లోను తీసుకోవాలంటే తస్మాత్ జాగ్రత్త అనాల్సిందే. మన బంగారమే కానీ వారికి నచ్చిన వారి పేరున లోను తీస్తారు..అంతేకాదు వారికి ఇష్టం వచ్చినంత లోను రాసుకుంటారు. చదువు రాని వారినే వారు టార్గెట్ చేస్తారు. వాళ్ళ ఇష్టం వచ్చినంత లోను రాసుకుంటారు. తీరలోను కడదామని వస్తే ఆలోను వేరే వారి పేరు మీద ఉండటంతో.. లబోదిబోమంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తతంగా మంత జరిగింది పట్టణంలోని ఓ ప్రైవేటు గోల్డ్ దుకాణంలో చోటు చేసుకుంది.

మునగాల మండల పరిధిలోని ఎకలాస్కన్ పేట గ్రామానికి చెందిన ఎం. ఎల్లమ్మ పట్టణంలోని హైదరాబాద్ వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న ప్రైవేటు గోల్డ్ దుకాణంలో మొదట తన పేరు మీద బంగారు నగలను ఇచ్చి 23 వేలకు పైగా లోను తీసుకుంది. ఇంకా తన అవసరాలకు డబ్బు అవసరం కాగా..మరల బంగారం తీసుకువచ్చి నగదు ఇవ్వమని కోరగా సర్వర్ బిజీగా ఉంది అని తెలిపారు. మొదటగా 10000 ఇచ్చారు. మరుసటి రోజు 10,000 ఇచ్చారని బాధితులు తెలిపారు. మొత్తం 20000 తీసుకున్న ఈ లోన్ ని సాయి అనే వ్యక్తి పేరుపై క్రియేట్ చేసి లోను మొత్తాన్ని 25 వేల రూపాయలుగా సిబ్బంది చాకచక్యంగా మార్చేశారు. బాధితులు నగదు కట్టడానికి రాగానే ఎవరికో సంబంధించిన లోనుకు సంబంధించిన రసీదు ఇవ్వడంతో అవాక్కయ్యారు. నాకు సంబంధించిన లోను రసీదు ఇవ్వకుండా వేరొకరిది ఇవ్వడం ఏమిటని బాధితులు ప్రశ్నించారు. నేను తీసుకున్నది 20,000 అయితే 25000 అని ఎందుకు రాశారు అని ప్రశ్నించారు. గోల్డ్ లోన్ యాజమాన్యం దీనిపై పొంతన లేని సమాధానాలు తెలుపుతున్నారని బాధితులు వాపోయారు.

అసలు ఆ వ్యక్తి ఎవరని ప్రశ్నించగా.. మా బంధువు అని గోల్డ్ లోన్ యాజమాన్యం తెలపడంతో అవాక్కయ్యారు . అతనిపై ఈ విధంగానే చాలా లోన్లు చేశారని పలువురు తెలుపుతున్నారు. ఈ విధంగా కస్టమర్లను మోసం చేస్తున్న వీరిపై చర్యలు తీసుకోవాలని పట్టణ పోలీసులను కూడా ఆశ్రయించారు. ఇలాంటివి ఈ బ్యాంకులో నిత్య కృత్యంలో జరుగుతుంటాయని పలువురు తెలుపుతున్నారు. ఈ విధంగా కస్టమర్లను మోసం చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలుపుతున్నారు.


Next Story

Most Viewed