మాజీ ఎమ్మెల్యేకు ఊహించని షాక్.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

by Shiva |
మాజీ ఎమ్మెల్యేకు ఊహించని షాక్.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ (YCP), టీడీపీ (TDP) నాయకులను అంతమొందించడమే లక్ష్యంగా పని చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆ పార్టీ కార్యకర్తలపై దాడులకు పాల్పడింది. దాడి చేసిందే కాకుండా తిరిగి వారిపైనే పోలీసులతో పెట్టించి తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. అయితే, రాష్ట్రంలో ప్రభుత్వం మారినా.. వైసీపీ (YCP) నాయకుల అరాచకాలకు మాత్రం అడ్డుకట్టపడటం లేదు. ఎక్కడి పడితే అక్కడ వైసీపీ నేతలు టీడీపీ (TDP) నేతలు, సానుభూతిపరులపై యథచ్ఛగా దాడులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఏలూరు జిల్లా (Eluru District)లో వైసీపీ శ్రేణులు మరోసారి బీభత్సం సృష్టించాయి. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ (Denduluru MLA Chintamaneni Prabhakar)పై దాడి కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి (Abbaiah Chowdary)పై కేసు నమోదైంది. ఎమ్మెల్యే డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌ (Eluru 3 Town Police Station)లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్‌తో పాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

కాగా, ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ (Chintamaneni Prabhakar)పై హత్యాయత్నం జరిగింది. బుధవారం రాత్రి ఏలూరు (Eluru) శివారులోని ఓ గ్రామంలో జరిగిన వివాహ వేడుకకు ఎమ్మెల్యే చింతమనేని హాజరయ్యారు. అయితే ,అదే వేడుకకు వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి కూడా వచ్చారు. పెళ్లి చూసుకుని చింతమనేని తన కారులో ఇంటికి వెళ్తుండగా.. ఆయన కారుకు అబ్బయ్య చౌదరి కారు అడ్డుగా పెట్టాడు. కారును అడ్డు తీయాలని చింతమనేని డ్రైవర్ వెళ్లి అబ్బయ్య చౌదరిని అభ్యర్థించగా.. ఆయన విచక్షణ రహితంగా డ్రైవర్, గన్‌మ్యాన్‌‌లపై దాడికి పాల్పడ్డారు. దీంతో చింతమనేని డ్రైవర్ ఏలూరు త్రిటౌన్ పోలీస్ స్టేషన్‌లో అబ్బయ్య చౌదరిపై ఫిర్యాదు చేశాడు.



Next Story

Most Viewed