మైనర్ బాలికపై మేనమామ అత్యాచారయత్నం.. నోట్లో యాసిడ్ పోయడంతో..

by Sathputhe Rajesh |
మైనర్ బాలికపై మేనమామ అత్యాచారయత్నం.. నోట్లో యాసిడ్ పోయడంతో..
X

దిశ, వెబ్‌డెస్క్: మైనర్ బాలికపై మేనమామ అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ప్రతిఘటించిన బాలిక నోట్లో యాసిడ్ పోశాడు. దీంతో బాలిక ఐదు నెలలు మృత్యువుతో పోరాడి మంగళవారం తుదిశ్వాస విడిచింది. ఈ దారుణ ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటాచలం గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్‌కి 18 ఏళ్ల క్రితం కుమారుడు పుట్టి చనిపోయాడు.

తర్వాత చాలా ఏళ్ల తర్వాత ఓ కూతురు పుట్టింది. ఒక్కగానొక్క కూతురిని ఆ దంపతులు అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. గతేడాది సెప్టెంబర్ 5న కుటుంబసభ్యులు నెల్లూరు వెళ్లగా బాలిక ఒంటరిగా ఇంట్లో ఉంది. ఈ విషయాన్ని గమనించిన బాలికకు వరుసకు మేనమామ ఇంట్లోకి చొరబడి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ప్రతిఘటించిన బాలిక బాత్ రూంలోకి వెళ్లి దాక్కుంది. దీంతో కోప్రొద్రిక్తుడైన బాలిక మేనమామ ఆమె నోట్లో యాసిడ్ పోశాడు. దీంతో చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురైంది. బాలిక కుటుంబ సభ్యులు ఆమెకు చెన్నైలో చికిత్స చేయిస్తున్నారు. తాజాగా మంగళవారం బాలిక పరిస్థితి విషమించడంతో మృతి చెందింది. ఈ ఘటనపై నెల్లూరు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed