- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కసింకోటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్
దిశ, కశింకోట: బతుకు తెరువు కోసం వేకు జామున ఆటోలో బయలుదేరిన కూలీలపై విధి కన్నెర్ర చేసింది. మృత్యు రూపంలో లారీ కబలించడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు విగతజీవులుగా మారారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. కశింకోట జాతీయ రహదారి 16 పై మంగళవారం తెల్లవారుజామున 5:30 కు బయ్యవరం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ శనివాడ తలుపుల రాజు బయ్యవరం నుండి ఆటోలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద కు చేరుకుని ప్రయాణికులను ఎక్కించుతుండగా అదే సమయంలో రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి బయలుదేరిన సిమెంట్ ట్యాంకర్ లారీ వెనకనుంచి వేగంగా ఢీ కొనడంతో అక్కడవున్న ఆటో డ్రైవర్ శనివాడ తలుపుల రాజు, కశింకోట ఇంద్ర కాలనీకి చెందిన మునగపాక లక్ష్మీ అక్కడికి అక్కడే మృతి చెందారు.
ఆటోలో ఉన్న బయ్యవరం గ్రామానికి చెందిన ప్రయాణికులు చాపరెడ్డి సత్యవతి, మామిడి లక్ష్మీ, గుర్రం దుర్గ నాయుడు, కశింకోట కి చెందిన సన్నాడ రాజు, బొడ్డేడ ధనలక్ష్మి, హేమంత్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కాగా ప్రమాద స్థలం వద్ద జనాలు గుమిగూడి ఉండగా మరో లారీ వెనకనుండి వచ్చి ప్రమాదానికి కారణమైన లారీని ఢీకొంది. అయితే దీనివల్ల ఎవరికీ ప్రమాదం సంభవించలేదు. కశింకోట అదనపు ఎస్ఐ నాగేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.