- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇద్దరు నకిలీ విలేకరులు అరెస్ట్
దిశ, కోరుట్ల : నకిలీ విలేకరులుగా చలామని అవుతూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు మెట్ పల్లి సీఐ నిరంజన్ రెడ్ది తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం...మల్లాపూర్ మండలం సాతారం గ్రామానికి చెందిన చౌడారపు వెంకటరమణ అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా కిరాణా షాప్ నిర్వహిస్తున్నాడు. ఈ నెల 24న మెట్ పల్లిలోని కిరణం సామాగ్రి కొనుగోలు చేసి తన కారులో తిరుగు ప్రయాణం అవ్వగా అది గమనించిన గుండమిది రాజశేఖర్ వెంపేట శివారులోని వెంకటేశ్వర ఆలయం వద్దకు తన కారులో వెంబడించి వెంకటరమణ కారుకి అడ్డు పెట్టి నీ కారు లో తరలిస్తున్న వస్తువులు డూప్లికేట్ అని వాటిని చిందరవందల చేసి బెదిరింపులకు పాల్పడి పోలీస్ స్టేషన్ కి రావాలని ఒత్తిడి చేశారు.
అంతలో మరో నకిలీ విలేకరికి ఫోన్ చేయగా అక్కడికి చేరుకున్న మరో నకిలీ విలేకరి రామగిరి కార్తీక్ రూ. 10 వేలు డిమాండ్ చేసి బలవంతంగా వెంకటరమణ ఫోన్ లాక్కొని 4 వేల రూపాయలను ఫోన్ పే ద్వారా పంపించుకున్నారు. అనంతరం ఇక్కడి నుండి వెళ్లిపోవాలని, ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డట్టు తెలిపారు. వెంకటరమణ శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పట్టణంలోని ఓ పెట్రోల్ బంక్ వద్ద రాజశేఖర్, కార్తీక్ లను అదుపులోకి తీసుకొని వారి వద్ద ఉన్న ఒక కారు, ద్విచక్ర వాహనం, రెండు సెల్ ఫోన్ లు స్వాధీన పరుచుకుని కేసు నమోదు చేశామని సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. మెట్ పల్లి సర్కిల్ లో ఎవరైనా విలేకరులమని అక్రమ వసూళ్లకు పాల్పడితే ప్రజలు, వ్యాపారవేత్తలు అప్రమత్తంగా ఉండాలని వెంటనే పోలీస్ లకు సమాచారం ఇవ్వాలని కోరారు.