- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తల్లి మృతదేహంతో 8 రోజులు ఇంట్లోనే గడిపిన ఇద్దరు కూతుర్లు.. అసలు విషయం తెలిస్తే కంటనీరు ఖాయం

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్(Hyderabad) మహా నగరంలో వరుస దారుణ ఘటనలు చోటుచేకుంటున్నాయి. ఇటీవలే మీర్‌పేట్‌లో భార్యను హత్య చేసి వారం, పదిరోజుల పాటు ఆమె డెడ్‌బాడీతో పాటే గడిపిన ఘటన మరువక ముందే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. గత ఎనిమిది రోజుల క్రితం వారాసిగూడలో గుండెపోటుతో లలిత అనే మహిళ ఇంట్లోనే మృతిచెందింది. దహన సంస్కారాలకు డబ్బుల్లేక తల్లి మృతదేహం(Mother Dead Body)తో ఇద్దరు కూతుళ్లు ఇంట్లోనే ఎనిమిది రోజుల పాటు గడిపారు. ఆ తర్వాత స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లి జరిగిన విషయం చెప్పారు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వాలని MLA వారికి సూచించారు. అనంతరం ఆ కూతుళ్లు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. హుటహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. దహన సంస్కారాలకు పోలీసులు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు.
కాగా, మీర్‌పేట్‌లో కూడా ఇదే తరహాలో మృతదేహాన్ని రోజుల తరబడి భర్త ఇంట్లోనే ఉంచుకున్నాడు. అయితే.. అక్కడి పరిస్థితికి, ఇక్కడి దీనస్థితికి చాలా వ్యత్యాసం ఉంది. పగ పెంచుకుని గురుమూర్తి అనే వ్యక్తి భార్యను అతి క్రూరంగా చంపాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులకే ఒళ్లు గగుర్పొడిచింది. ఒక మనిషిని ఇంత క్రూరంగా చంపుతారా? అని తామే నివ్వెరపోయామని స్వయంగా రాచకొండ పోలీస్ కమిషనర్ చెప్పారు. ఈ తరహా ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా మార్పు రావట్లేదు.