- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఒకరు మృతి
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. దాంతో ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి న్యాయం చేయాలని మృతుడి బంధువులు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ధర్నాకు దిగారు. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలోని గంభిరావుపేట మండలం గజసింగవరం, మల్లుపల్లి గ్రామాల మధ్య శుక్రవారం అర్ధరాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో గజసింగవరం గ్రామం రాజేశ్వర్ నగర్ కు చెందిన చెల్ల రమేష్ (35) అక్కడికక్కడే మృతిచెందాడు.
మృతుడికి తల్లి రామవ్వ, భార్య రజితతో పాటు కూతుళ్లు మేనక, రిషిక, కొడుకు రిషి ఉన్నారు. మృతుడు లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా ఘటన జరిగింది. కాగా మృతుని కుటుంబానికి నష్టపరిహారం అందించాలని, బంధువులు శనివారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. సిరిసిల్ల పోలీసులు ధర్నా స్థలానికి చేరుకొని నచ్చజెప్పే క్రమంలో ఇరు వర్గాల మధ్య కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. సిరిసిల్ల పట్టణ సీఐ కృష్ణ మృతుని కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించారు.