- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బెదిరింపులకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్
దిశ,మంథని : బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను మంథని పోలీస్ లు అరెస్ట్ చేశారు. మంథని సీఐ బి.రాజు తెలిపిన వివరాల ప్రకారం గాజుల పల్లె గ్రామానికి చెందిన కందుల శ్రీనివాస్ ( 33) అతని స్నేహితుడు సౌతకారి సంపత్ ( 33) కలిసి ఊర్లో నుండి మంథని వచ్చే అమ్మాయిలకు డబ్బులు ఆశ చూపి వారి ఫొటోలు, వీడియోలు తీసి వారికి తెలిసిన వ్యక్తులకు పంపి డబ్బులు తీసుకునేవారు. అలాగే అమ్మాయిల ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి ఆ వీడియోలను వారికి పంపి వారిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకునేవారు. మంథని సూరయ్య పల్లె గ్రామానికి చెందిన ఆర్ల నాగరాజు అనే వ్యక్తి వీడియోలు సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేసి పెట్టారు.
వీడియోకి సంబంధించిన అసలైన వీడియో తన దగ్గర ఉందని, రూ.50 వేలు కావాలని లేకుంటే ఒరిజినల్ వీడియోని సోషల్ మీడియాలో పెడతానని బెదిరించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపుతామని బ్లాక్ మెయిల్ చేయగా నాగరాజు తన దగ్గర రూ. 30 వేలు మాత్రమే ఉన్నాయని బతిమిలాడాడు. దానికి వారు ఒప్పుకోగా ఈనెల 27న రూ.30వేలు వారికి ఇచ్చాడు. తర్వాత రోజు నాగరాజు పోలీస్ స్టేషన్ కి వచ్చి ఈ విషయం గురించి దరఖాస్తు ఇవ్వగా పై ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్ పంపారు. ఈ కార్యక్రమంలో మంథని ఎస్ఐ డి.రమేష్, ఏఎస్ఐ సత్యనారాయణ,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.