- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మేడే రోజున తీవ్ర విషాదం.. ఊపిరాడక ఇద్దరు కార్మికులు మృతి
దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం రోజున సెప్టిక్ ట్యాంకు శుభ్రం చేస్తుండగా ఇద్దరు కార్మికులు మృతిచెందిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్లే.. గోవిందన్(45), సుబ్బరావు(45) అనే ఇద్దరు కార్మికులు తిరువళ్లూరులోని ఒక ప్రవేటు స్కూల్లో సెప్టిక్ ట్యాంకు క్లీన్ చేయడానికి వెళ్లారు. కాగా శుభ్రం చేసేందుకు ట్యాంకు లోపలికి దిగగా.. విషవాయువులు పీల్చి, ఊపిరాడక అక్కడికక్కడే మరణించారు. రోప్ హార్నెస్, భద్రతా పరికరాలను ఉపయోగించి.. ఫైర్, రెస్క్యూ ఆఫీసర్స్ వీరి మృతదేహాలను వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టానికి పొర్నేరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఇద్దరి కార్మికులను మీంజూర్ పంచాయతీ అధికారులే పంపించారని పాఠశాల ప్రిన్సిపల్ సిమియోన్ విక్టర్ తెలిపారు. మే డే రోజున వీరిద్దరికీ పారిశుధ్య పనులు కేటాయించలేదని పంచాయతీ ఆఫీసర్లు స్కూలు వాదనలు కొట్టిపారేశారు. కాగా పోలీసులు ప్రిన్సిపల్ సిమియోన్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.