పాలమూరు ప్రాజెక్ట్ పనుల్లో టిప్పర్ బోల్తా.. డ్రైవర్ కు తీవ్ర గాయాలు

by Kalyani |
పాలమూరు ప్రాజెక్ట్ పనుల్లో టిప్పర్ బోల్తా.. డ్రైవర్ కు తీవ్ర గాయాలు
X

దిశ, బిజినేపల్లి: పాలమూరు ప్రాజెక్ట్ పనుల్లో టిప్పర్ బోల్తా పడి డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయిన సంఘటన బిజినేపల్లి మండల పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళ్లితే.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో భాగంగా బిజినేపల్లి మండల పరిధిలోని వట్టెం వెంకటాద్రి రిజర్వాయర్ కట్ట పనులు జరుగుతున్నాయి. కాగా కట్ట పనులకు పని చేస్తున్న క్రమంలో శనివారం ఉదయం టిప్పర్ అదుపు తప్పి బోల్తా పడింది.

ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే చికిత్స నిమిత్తం డ్రైవర్ ను ఎక్కడ తరలించారన్న అంశాన్ని మాత్రం హెచ్ఎస్ కంపెనీ యాజమాన్యం గోప్యంగా ఉంచింది. దీంతో కంపెనీ యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed