ఆ ఎమ్మెల్యేకు బెదిరింపు కాల్స్..

by Sumithra |
ఆ ఎమ్మెల్యేకు బెదిరింపు కాల్స్..
X

దిశ, బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు బెదిరింపు ఫోన్ కాల్స్ తీవ్రకలకలం రేపాయి. బెదిరింపు కాల్స్ తో పాటు మెసేజ్ లు ఆందోళన రేకెత్తించాయి. పోలీసుల కథనం ప్రకారం ఏప్రిల్ 24న గుర్తుతెలియని దుండగులు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను ఫోన్లో డబ్బుల కోసం బెదిరించారంటూ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. డబ్బుల కోసం ఎమ్మెల్యేను ఫోన్ చేసి బెదిరించి, మెసేజులకు పాల్పడిన అగంతకుడిని పోలీసులు గుర్తించారు. ఎమ్మెల్యేను బెదిరించిన వ్యక్తిని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అస్మాబాద్ గ్రామానికి చెందిన ఎండీ. ఇషన్ గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు బెల్లంపల్లి వన్ టౌన్ పోలీసులు కేసునమోదు చేసుకుని నిందితున్ని బెల్లంపల్లి కోర్టులో హాజరు పరిచారు.

Advertisement

Next Story