తమదాకా వచ్చేదాక వీరు మారడం లేదు...

by Sridhar Babu |
తమదాకా వచ్చేదాక వీరు మారడం లేదు...
X

దిశ, వరంగల్ టౌన్ : నగరంలోని పలు హోటళ్లపై బల్దియా అధికారులు శనివారం దాడులు చేశారు. అపరిశుభ్రంగా హోటళ్ల నిర్వహణ చేపడుతున్న నిర్వాహకులకు రూ. 60 వేలు జరిమానా విధించారు. ఈ మేరకు ముఖ్య ఆరోగ్యాధికారి డాక్టర్ రాజారెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేయూసీ రెండవ గేటు సమీపంలో గల కనకయ్య హోటల్, రెడ్డి హోటల్ ల నిర్వాహకులు సరైన హైజీన్ పద్ధతులు పాటించడం లేదని ఫిర్యాదులు అందాయన్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఆకస్మికంగా ఈ హోటళ్లలో తనిఖీలు నిర్వహించగా వంట గది, మూత్రశాలల నిర్వహణ సరిగా లేదని తెలిపారు. హోటళ్లలో పనిచేసే వర్కర్లకు పీపీఈ కిట్లు లేవని, ఆయా హోటళ్లలో ఫైర్ సేఫ్టీ కూడా లేదని తెలిపారు.

హోటల్ ఆవరణ అపరిశుభంగా ఉందని, డ్రైన్ ఔట్ లెట్ సరిగా లేదని జాలీ అమర్చలేదని, హోటల్ వ్యర్థాలు నేరుగా డ్రైన్ లోకి వదలడం తదితర కారణాలను గుర్తించినట్టు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా కమిషనర్ ఆదేశాల మేరకు కనకయ్య హోటల్ కు రూ.50 వేలు, రెడ్డి హోటల్ కు రూ.10 వేలు పెనాల్టీ విధించడం జరిగిందని తెలిపారు. హోటల్ నిర్వాహకులు ఆరోగ్యకర వాతావరణంలో నిర్వహించాలని, లేకుంటే నిబంధనల మేరకు జరిమానాలు విధించి సీజ్ చేస్తామని సీఎంహెచ్ఓ హెచ్చరించారు. ఈ తనిఖీల్లో శానిటరీ సూపర్వైజర్ నరేందర్, శానిటరీ ఇన్స్పెక్టర్లు గోల్కొండ శ్రీను, అనిల్, సంపత్ రెడ్డి పాల్గొన్నారు.


Next Story

Most Viewed