- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సిగరెట్ తాగిండని విద్యార్థిని చితకబాదిన టీచర్లు.. చికిత్స పొందుతూ విద్యార్తి మృతి
దిశ, వెబ్ డెస్క్: తమ ముందే సిగరెట్ తాగిండని ఓ విద్యార్థిని చితకబాదారు ప్రిన్సిపాల్, టీచర్లు. దీంతో తీవ్ర గాయాలపాలైన విద్యార్థి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఈ ఘటన బీహార్ లో జరిగింది. పోలీసులు, విద్యార్థి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ లోని ఈస్ట్ చంపారన్ జిల్లాకు చెందిన బజ్రంగి కుమార్ (15) ఓ ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. అయితే ఈ నెల 24న రిపేర్ కు ఇచ్చిన ఫోన్ ను తీసుకురావడానికి సదరు విద్యార్తి మధుబన్ టౌన్ కు తన ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లాడు. ఫోన్ తీసుకుని తిరిగి వస్తూ మార్గమధ్యలో ఉన్న హార్దియా బ్రిడ్జి కింద ఆగి సిగరెట్ తాగుతున్నాడు బజ్రంగి. అయితే అప్పుడే అటుగా వెళ్తున్న ఆ విద్యార్థి చదువుతున్న పాఠశాల చైర్మన్, ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ యాదవ్.. బజ్రంగి సిగరెట్ తాగుతుండగా చూశాడు.
దీంతో సదరు విద్యార్థిని దగ్గరకు పిలిచి పేరెంట్స్ తో కలిసి పాఠశాలకు రావాలని కోపంగా చెప్పాడు. వెంటనే తల్లిదండ్రులను తీసుకొని స్కూల్ కు వెళ్లిన ఆ విద్యార్థిని సిగరెట్ తాగుతావా అని నానా బూతులు తిడుతూ చైర్మన్, టీచర్లు బెల్ట్, స్టిక్స్ తో విపరీతంగా కొట్టారు. దీంతో ఆ విద్యార్థి సొమ్మసిల్లి కిందపడ్డాడు. వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించగా తీవ్ర గాయాలయ్యాయని వేరే ఆసుపత్రికి తరలించాలని అక్కడి డాక్టర్లు చెప్పారు. దీంతో బజ్రంగిని ముజఫర్ పూర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ విద్యార్థి సోమవారం మృతి చెందాడు. ప్రిన్సిపాల్, టీచర్లు కొట్టడం వల్లే తన కుమారుడు చనిపోయాడని విద్యార్థి తల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.