- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెరుగుతున్న చైల్డ్ పోర్నోగ్రఫీ నేరాలు.. ప్రత్యేక దృష్టి సారించిన సీఐడీ
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: చైల్డ్ పోర్నోగ్రఫీని విస్తృతంగా సోషల్ మీడియాలోని వేర్వేరు ప్లాట్ పాంలలో వైరల్ చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ నీలిచిత్రాలు చూడటానికి అలవాటు పడి మానసిక రోగులుగా మారుతున్న కొందరు వీడియోలను వాట్సాప్ తదితర గ్రూపుల్లో షేర్ చేస్తూ మరికొందరిని తప్పుడు తోవల్లోకి నెట్టేస్తున్నారు. ఇలాంటి వీడియోలు చూస్తున్న కొందరు నేరాలకు సైతం పాల్పడుతుండటం ఆందోళనాకరమైన అంశం. క్రమంగా ఈ తరహా నేరాలు పెరిగిపోతుండటంతో సీఐడీ విభాగం వీటిపై ప్రత్యేక దృష్టిని సారించింది. వేర్వేరు ఏజన్సీల నుంచి అందుతున్న సమాచారం మేరకు కేసులు నమోదు చేస్తుండటంతోపాటు అరెస్టులు కూడా చేస్తోంది. అయినా ఈ తరహా నేరాలకు కళ్లెం మాత్రం పడటం లేదు.
వీళ్లే ఎక్కువ..
సీఐడీ విభాగానికి చెందిన ఓ సీనియర్ అధికారి చెప్పిన ప్రకారం చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలను ఆయా సోషల మీడియా ప్లాట్ పాంలలోకి అప్ లోడ్ వారిలో సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్స్, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులే ఎక్కువగా ఉంటున్నారు. జేబులో ఉండే స్మార్ట్ ఫోన్ కంప్యూటర్లు, ల్యాప్ ట్యాప్ ఉపయోగిస్తూ వీళ్లు వేర్వేరు పోర్న్ వెబ్ సైట్లను సందర్శిస్తూ అక్కడి నుంచి అయిదు నిమిషాలు మొదలుకుని పదకొండు నిమిషాల నిడివిగల చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలను డౌన్ లోడ్ చేసిన అనంతరం వాటిని వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్ స్టా తదితర గ్రూపుల్లో అప్ లోడ్. దీనిపై సీనియర్ డాక్టర్ విజయ్ కుమార్ మాట్లాడగా సరదగా చూడటం మొదలుపెట్టి కొందరు పోర్న్ వీడియోలు చూడటానికి బానిసలుగా మారుతున్నారన్నారు. ఇది ఒకరకమైన మానసిక జబ్బే అని చెప్పారు. ఇలా నీలిచిత్రాలు చూడటానికి అలవాటు పడుతున్న వారు తమకు తాముగా పతనం వైపు వెళుతుండటంతోపాటు మరికొందరిని అదే దారిలోకి నెడుతున్నారు.
నేరాలు..
ఆందోళనకరమైన అంశం ఏమిటంటే సెల్ ఫోన్లలో సైతం పోర్నో సైట్లు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో వారిలో కొందరు అలాంటి అనుభవాల కోసం వెంపర్లాడుతూ నేరాలకు సైతం పాల్పడుతున్నారు. దీనికి నిదర్శనంగా హయత్ నగర్ స్టేషన్ పరిధిలో కొంతకాలం క్రితం జరిగిన ఓ సంఘటనను పేర్కొనవచ్చు. ఓ స్కూల్లో చదువుకుంటున్న నలుగురు విద్యార్థులు నీలిచిత్రాలు చూడటానికి మరిగి తమ తరగతిలోనే చదువుకుంటున్న ఓ మానసిక వికలాంగురాలిని నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి సామూహిక అఘాయిత్యం జరిపారు. దీనిని మొబైల్ ఫోన్లలో వీడియోలు కూడా తీశారు. ఆ తరువాత నలుగురిలో ఒకనికి మిగితా వారితో గొడవ కావటం, కోపంతో సదరు విద్యార్థి వీడియోలను వైరల్ చేయడంతో జరిగిన దారుణం వెలుగు చూసింది. ఈ క్రమంలో పోలీసులు నలుగురిని అరెస్టు కూడా చేశారు. ఇలా చెబుతూ పోతే నీలిచిత్రాల ప్రభావంతో చిన్నవయసులోనే నేరాలు చేస్తున్న వారి ఉదంతాలు ఎన్నో ఉన్నాయని సీఐడీకి చెందిన ఓ అధికారి చెప్పారు.
దృష్టి సారించిన సీఐడీ..
చైల్డ్ పోర్నోగ్రఫీ చెందిన కేసులు ఎక్కువ అవుతుండటంతో వీటిని నివారించటానికి నోడల్ ఏజన్సీగా పని చేస్తున్న సీఐడీ వీటిపై సీరియస్ గా దృష్టిని సారించింది. సీఐడీ వర్గాలు చెబుతున్న ప్రకారం గడిచిన ఆరు నెలల్లోనే 44 కేసులు నమోదయ్యాయి. వీటిలో 8 కేసుల్లో ఛార్జీషీట్లను కూడా కోర్టుల్లో దాఖలు చేశారు. మరో 34 కేసులు విచారణ దశలో ఉన్నాయి. 2000వ సంవత్సరం ఐటీ యాక్ట్ ప్రకారం పోర్న్ వీడియోలు చూసినా, డౌన్ లోడ్ చేసినా, సర్క్యులేట్ చేసినా నేరమని సీఐడీ అధికారి ఒకరు చెప్పారు. దీని ప్రకారం నేరానికి పాల్పడ్డ వారికి కనీసం అయిదేళ్ల జైలుశిక్ష పడే అవకాశముంటుందన్నారు. ఇప్పటివరకు ముప్పయి మందికి పైగా నిందితులను ఈ కేసుల్లో అరెస్టు చేసినట్టు వివరించారు. మళ్లీ మళ్లీ ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న వారిపై సస్పెక్ట్ల షీట్లు కూడా తెరుస్తున్నట్టు తెలిపారు. చైల్డ్ పోర్నోగ్రఫీ సర్క్యులేషన్ చేస్తున్న వారి కంప్యూటర్ల ఐపీ అడ్రసులు, సెల్ ఫోన్ ను పసిగట్టేందుకు వేర్వేరు ఏజన్సీలు నిత్యం పని చేస్తున్నట్టు చెప్పారు. ఈ తరహా నేరాలకు పాల్పడేవారు ఖచ్చితంగా కటకటాల వెనక్కి పోతారన్నారు.