- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కట్టుకున్న భార్యను కడతేర్చిన భర్త..కత్తితో అతి దారుణంగా..

దిశ, దుమ్ముగూడెం : మండల పరిధిలోని గోవింద పురం గ్రామానికి చెందిన తాటి జయ పై ఆమె భర్త శుక్రవారం రాత్రి కత్తితో దాడి చేయగా తీవ్ర రక్తస్రావమై మరణించింది. వివరాలలోకి వెళితే కుంజా కన్నమ్మ నాగయ్య కూతురైన తాటి జయకు గోవింద పురం గ్రామానికి చెందిన తాటి నరసింహారావు కి 14 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కాగా గత కొంత కాలం నుంచి భార్యాభర్తలకి గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి వీరిద్దరి మధ్య గొడవ తీవ్ర స్థాయికి చేరగా ఆవేశంతో నరసింహారావు భార్య తాటి జయ పై కత్తితో దారుణంగా దాడి చేయగా తీవ్ర రక్తస్రావమై ఉండగా ఆమెను స్థానికులు ఆసుపత్రికి తీసుకు వెళ్తుండగా మార్గమధ్యంలో మరణించింది.మృతురాలు జయకు ఇద్దరు పిల్లలున్నారు. జయ తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా మృతురాలి భర్త తాటి నరసింహారావు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దుమ్ముగూడెం సీఐ బి.అశోక్ తెలిపారు.