- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆన్‌లైన్ యాప్‌ల్లో పెట్టుబడి.. కుటుంబం మొత్తం ఆత్మహత్యాయత్నం
దిశ, తాండూర్ : మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. కొడుకు ఆన్ లైన్ యాప్‌ల్లో పెట్టుబడి పెట్టడం.. వాటి ద్వారా అప్పులు పెరిగిపోవడంతో ఓ చిరు వ్యాపారి కుటుంబం మొత్తం ఆత్మహత్యాయత్నం చేసింది. పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకోవాలనుకున్న ఈ కుటుంబంలోని నలుగురు ప్రస్తుతం ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. తాండూర్ మండలం కాసిపేట గ్రామంలో జరిగిన ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
కాసిపేట గ్రామంలో సముద్రాల మొండయ్య కిరాణా షాప్ నిర్వహిస్తూ భార్య శ్రీదేవి, కుమారుడు శివ, కూతురు చైతన్యతో కలిసి నివసిస్తున్నాడు. కుమారుడు శివప్రసాద్ అప్పులు చేసి ఆన్‌లైన్ యాప్‌ల్లో భారీగా పెట్టుబడి పెట్టాడు. కానీ వాటిల్లో రాకపోగా.. పెట్టిన సొమ్ము కూడా పోయింది. దీంతో కుమారుడు చేసిన అప్పులు చెల్లించలేక మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో కుటుంబంలోని నలుగురు క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. విషం తాగిన అనంతరం మొండయ్య భార్య శ్రీదేవి తన తమ్ముడు రమేష్‌కు ఫోన్ చేసి విషయం చెప్పింది. వెంటనే రమేష్ బావ ఇంటికి వచ్చి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వారిని 108 వాహనంలో బెల్లంపల్లి ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం వారిని మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో హుటాహుటిన వరంగల్‌కు తరలించారు.