- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ పని చేయవద్దని వారించిన తల్లి.. తట్టుకోలేక కూతురు ఆత్మహత్య
దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్యకాలంలో చిన్నా, పెద్దా అని తేడా లేకుండా ఎవరి చేతిలో చూసిన స్మార్ట్ ఫోన్లే కనిపిస్తున్నాయి. ఇక పిల్లలైతే ఆన్‌లైన్ క్లాసుల పేరుతో తిండి కూడా తినకుండా మొబైల్‌కే అడిక్ట్ అవుతున్నారు. రోజు మొత్తం ఫోన్‌లోనే గడుపుతున్నారు. దీంతో పిల్లల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తల్లిదండ్రులు ఫోన్ వాడొద్దని హెచ్చరిస్తే కొంతమంది సూసైడ్ చేసుకొని చనిపోయిన వారు కూడా ఉన్నారు. తాజాగా ఇలాంటి ఘటనే గుజరాత్ జామ్‌నగర్‌లోని ధ్రోల్ తాలుకా పిపర్తోడ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..
జెనీషా(13) అనే అమ్మాయి 7వ తరగతి చదువుతుంది. వీరి కుటుంబం సూరత్‌లో నివాసం ఉంటుంది. సమ్మర్ హాలీడేస్ కోసం జామ్‌నగర్‌లోని తన మేనమామ ఇంటికి వెళ్లారు. అక్కడ జెనీవా, ఆమె సోదరుడు ఫోన్‌తో ఎక్కువసేపు ఆడుతున్నందున వారి తల్లి ఊర్మిళ కొప్పడింది. దీంతో మనస్తాపానికి గురైన ఆ బాలిక ఒక గదిలోకి వెళ్లి సూసైడ్ చేసుకుంది. చాలా సేపు అయినా జెనీవా కనిపించకపోవడంతో కుటుంబీకులు వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో తలుపు వేసి ఉన్న గది తెరచి చూడగా.. జెనీవా ఆత్మహత్య చేసుకుని కనిపిస్తుంది. వెంటనే ఆమెను హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే తను చనిపోయినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రమాదవశాత్తు మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.