- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పారిశుద్ధ్య కార్మికుడి ప్రాణం తీసిన కారు
దిశ, కూకట్పల్లి : విధులు నిర్వహించేందుకు వెళ్తున్న జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుడిని వెనక నుంచి మితిమీరిన వేగంతో వచ్చిన కారు ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలతో మృతి చెందాడు. ఈ సంఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జగద్గిరిగుట్ట సోమయ్య నగర్‌కు చెందిన ఎదురు సుధాకర్(32) మూసాపేట్ సర్కిల్ పరిధిలోని చైతన్య శానిటేషన్ వర్కర్స్ గ్రూప్‌లో పారిశుద్ధ్య కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు.
రోజు వారి మాధిరిగానే బుధవారం ఉదయం విధులకు హాజరు అయ్యేందుకు తన ద్విచక్ర వాహనంపై ఐడీఎల్ చెరువు కట్టపై వెళ్తుండగా రంగధాముని చెరువు సమీపంలో వెనుక నుంచి మితి మీరిన వేగంతో వచ్చిన కారు సుధాకర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది దీంతో సుధాకర్ కింద పడి తీవ్ర గాయాల పాలయ్యాడు. దాంతో స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సుధాకర్ మృతి చెందాడు. సుధాకర్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.