- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజధానిలో గ్రూప్స్ పరీక్షలు చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య..
దిశ, ముషీరాబాద్ : గ్రూప్స్ పరీక్షలు చదువుతున్న విద్యార్థిని రాష్ట్ర రాజధానిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నారాయణపేట జిల్లా మరికల్ మండలం, దత్తునగర్ కు చెందిన విజయ్ కుమార్, చంద్రకళ దంపతుల కూతురు రత్నకుమారి ( 24 ) ఆరు నెలల క్రితం హైదరాబాద్ వచ్చి గ్రూప్ 2 పరీక్షలకు ప్రిపేర్ అవుతుంది. నాగార్జున స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకుంటుంది. చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ వెనకాల గల తరంగిణి అనే గర్ల్స్ హాస్టల్ లో ఉంటుంది. ఆమెకు ఒక అక్క, ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడు ఉన్నారు. ఇదిలా ఉండగా సోమవారం సాయంత్రం 5: 30 గంటల సమయంలో రత్నకుమారి హాస్టల్ లోని తన గదిలో కాకుండా పక్క వారి గదిలో చున్నితో ఉరివేసుకుంది. విషయాన్ని గుర్తించిన మిగిలిన విద్యార్థులు 100కు డయల్ చేసి సమాచారాన్ని అందచేశారు.
ఈ మేరకు చిక్కడపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసునమోదు చేసుకున్న పోలీసులు రత్నకుమారి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. తనరూమ్ లో కాకుండా పక్కరూమ్ లో ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఇదే విషయాన్ని దిశ ప్రతినిధి ఎస్సై సందీప్ రెడ్డిని అడుగగా, మృతురాలు తన రూమ్ లో కంటే పక్కరూమ్ లోనే ఎక్కువగా ఉంటుందని, ఎవరితో ఎక్కువగా మాట్లాడదని తెలిపారు. ఆమె రూమ్ లో ఎలాంటి సూసైడ్ నోట్ లాంటివి దొరకలేదని, ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ, 6 నెలల క్రితం ఆమెకు అపెండిక్స్ ఆపరేషన్ జరిగిన తర్వాత రోజూ టాబ్లెట్లు వేసుకుంటుందని తెలిపారు. డిప్రెషన్‌కు గురై ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని ఎస్సై తెలిపారు. తల్లితండ్రులకు సమాచారం అందచేశామని పేర్కొన్నారు.