- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వివాహ బంధం విషాదం..మనస్తాపంతో ఆత్మహత్య
దిశ,బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో వివాహ బంధం భగ్నంతో ఓ యువకుడి ప్రాణాన్ని బలితీసుకుంది. ఇటీవలనే వివాహం జరిగింది. వివాహం జరిగి వారం గడవక ముందే ఆ యువతి ఆ యువకుడిని వీడింది. అది భరించలేక పోయాడు. ఆ మోసాన్ని జీర్ణించుకోలేక పోయాడు. కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఎంతగానో ఓదార్చారు ధైర్యం నింపారు. అయినప్పటికీ జరిగిన మోసం నుండి ఇప్పటికీ తేరు కోలేక పోయాడు. చివరికి ఆత్మహత్యతో తన జీవితానికి ముగింపు పలికిన సంఘటన బెల్లంపల్లిలో ఇవాళ చోటు చేసుకుంది. బెల్లంపల్లి పట్టణం కన్నాల బస్తీకి చెందిన ఈరభత్తుల ప్రవీణ్ కుమార్ (30) ఇంట్లో ఉరి వేసుకొని తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నాడు.
ఎప్పటిలాగే డ్యూటీ కి వెళ్లడానికి నిర్ణీత సమయంలో రెడీ అయ్యి ప్రవీణ్ కుమార్ 6:00 దాటిన తన గది నుంచి బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి తలుపు తట్టి పిలిచారు. ఇంతకీ లోపల నుంచి ప్రవీణ్ కుమార్ ను స్పందన రాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు తలుపు పగలగొట్టి లోనికి వెళ్లి చూసేసరికి ఉరివేసుకొని మృతి చెంది ఉన్నాడు. ఈ సంఘటన చూసి తల్లిదండ్రులు , సోదరులు కన్నీరు మున్నీరు అయ్యారు.
మోసాన్ని తట్టుకోలేక..
బెల్లంపల్లి పట్టణం కన్నాల బస్తీకి చెందిన ఈరభత్తుల ప్రవీణ్ కుమార్ కు బెల్లంపల్లి లోని ఓ యువతితో ఇదే సంవత్సరం ఫిబ్రవరి మాసంలో వివాహం జరిగింది. అంగరంగ వైభవంగా జరిగిన వివాహ బంధం ఎంతో కాలం నిలువలేదు. వివాహమైన వారం క్రితమే ప్రవీణ్ కుమార్ భార్య పుట్టింటికి వెళ్లి వస్తానని చెప్పి అక్కడే ఉండిపోయింది. దీంతో వారి బంధం తెగిపోయినట్టుంది. వివాహ బంధం భగ్నం అయిన సంఘటన నుంచి ప్రవీణ్ కుమార్ తేరుకోలేక కుమిలిపోతున్నాడు. ఇంతలోనే పిడుగు లాంటి వార్త ప్రవీణ్ కుమార్ చేరింది. మరో వ్యక్తితో తనకు విడాకులు కాకముందే భార్య వివాహం చేసుకోవడం తో మనస్తాపానికి గురయ్యాడు.
ఈ నేపథ్యంలో మనసు కకావికలమైన ఉరి వేసుకొని తన జీవితాన్ని ముగించడం బెల్లంపల్లిలో విషాదం నింపింది. పెళ్లి చేసుకొని యువతి చేతిలో మోస పోయిన ప్రవీణ్ కుమార్ పరువు పోయిందనితో ఇంతకాలం కుమిలి పోయాడు. ఆ బాధను తాళలేక చివరకు తాను చాలించాడు. ప్రవీణ్ కుమార్ మూడు సంవత్సరాల క్రితం తన తండ్రి శ్రీనివాస్ ఉద్యోగాన్ని డిపెండెంట్ కింద శాంతి ఖని లో యాక్టింగ్ సరుకుగా ఉద్యోగాన్ని కొనసాగిస్తున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బెల్లంపల్లి వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.