శిరిడీలో ఘోర ప్రమాదం.. నలుగురు భువనగిరి వాసులు మృతి

by Gantepaka Srikanth |
శిరిడీలో ఘోర ప్రమాదం.. నలుగురు భువనగిరి వాసులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలోని శిరిడీ(Shirdi) సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు యాదాద్రి భువనగిరి(Bhuvanagiri) జిల్లా వాసులు మృతిచెందారు. మరో ఎనిమిది మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతులు మోత్కూర్ మున్సిపాలిటీ(Mothkur Municipality) పరిధిలోని కొండగడప గ్రామానికి చెందిన వాసులుగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక ఆరు నెలల చిన్నారి ఉన్నట్లు సమాచారం. రెండ్రోజుల క్రితం శిరిడీ పర్యటనకు వెళ్లగా.. తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story