- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫిట్నెస్ లేని వాహనాలు తిరుగుతున్నాయి.. బీ కేర్ ఫుల్
దిశ, రాచకొండ : ఆర్టీఏ ఏజెంట్లు చేసిన ఫేక్ దందాతో 1000 వాహనాలు ఎలాంటి ఫిట్ నెస్ లేకుండా రోడ్లపై తిరుగుతూ మృత్యు శకటాలుగా మారాయి. తాజాగా రాచకొండ ఎస్ఓటీ పోలీసులు అలా తిరుగుతున్న వాహనాలను గుర్తించే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆ వాహనాలకు ఆర్టీఏ కార్యాలయంలో అనుమతులు మంజూరు చేయించిన ఏజంట్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎస్ఓటీ ఇన్స్ పెక్టర్ సుధాకర్ ఆధ్వర్యంలోని బృందం దర్యాప్తును ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఆ వాహనాలకు క్లియరెన్స్ ఎలా వచ్చిందనే కోణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఏజంట్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారు చెప్పిన సమాచారం ఆధారంగా విచారణనే వేగవంతం చేశారు. ఇక ఈ ఏజెంట్లకు ఆర్ టీ ఏ అధికారులు సహకిరించి ఉంటారని పోలీసులు గట్టిగా అనుమానిస్తున్నారు. అంతే కాకుండా ఆ 1000 వాహనాల యజమానులు కూడా నిందుతులు అయ్యే అవకాశం ఉంది. వీరంతా తెలిసి నకిలీ పత్రాలతో ఫిట్ నెస్ పొందారని పోలీసు లు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. బుధవారం రాచకొండ ఎస్ఓటీ, ఆదిబట్ల పోలీసులు మన్నెగూడ లక్ష్మి జిరాక్స్ కేంద్రం వద్ద ఆర్టీఏ ఏజెంట్లు రాఘవేందర్ రెడ్డి, ఆనంద్, వేణు, శ్రీధర్, శ్రీశైలం, యాదగిరిలను అరెస్టు చేసి 74 నకిలీ ఇన్సూరెన్సు, ఆధార్ కార్డు లు, ఫిట్ నెస్ పత్రాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.