ఇప్పటికీ మిస్సింగ్ కేసుగానే ఉంది.. రాచకొండ CP షాకింగ్ స్టేట్‌మెంట్

by Gantepaka Srikanth |
ఇప్పటికీ మిస్సింగ్ కేసుగానే ఉంది.. రాచకొండ CP షాకింగ్ స్టేట్‌మెంట్
X

దిశ, వెబ్‌డెస్క్: మీర్‌పేట్ హత్య కేసు(Meerpet Murder Case)లపై రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు(Rachakonda CP Sudheer Babu) కీలక ప్రకటన చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు. ఇతర రాష్ట్రాల ఫోరెన్సిక్ నిపుణులతో ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. నిపుణుల సలహా మేరకే ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. ఆ కేసు ఇప్పటికీ మిస్సింగ్ కేసుగానే ఉందని వెల్లడించారు. కేసుకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. కాగా, రంగారెడ్డి జిల్లా మీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌(Meerpet Police Station) పరిధిలో భార్యను భర్త అతి క్రూరంగా హత్య చేసిన ఘటన రాష్ట్రంలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. భార్యను తలపై కర్రలతో మోది హత్య చేసి.. ఆ తర్వాత మటన్‌ కత్తితో నరికి.. శరీర భాగాలను బకెట్‌లో వేసి వాటర్‌ హీటర్‌తో ఉడికించాడు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Advertisement
Next Story