- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పబ్ జీ కి బానిసై సొంత తల్లిదండ్రులనే హతమార్చాడు.. అసలు ఏం జరిగిందంటే?
దిశ, వెబ్ డెస్క్: పబ్ జీ కి బానిసైన యువకుడు సొంత తల్లిదండ్రులను దారుణంగా కొట్టి చంపాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాజిల్లాలోని నవాబాద్ ఠాణా పరిధిలోని గుమ్నాబర్ ప్రాంతానికి చెందిన అంకిత్ అనే యువకుడు 2018 వరకు బాగానే ఉన్నాడు. ఆ సమయంలో పోటీ పరీక్షలకు కూడా ప్రిపేర్ అయ్యాడు. అయితే 2018లో అతడికి పబ్ జీ అలవాటు అయ్యింది. అప్పటినుంచే అతడిలో వింత మార్పు రావడం మొదలైంది. నిత్యం పబ్ జీ ఆడుతుండేవాడు. దీంతో కంగారుపడ్డ తల్లిదండ్రులు లక్ష్మీప్రసాద్, విమలా దేవి ఎన్నోసార్లు పబ్ జీ ఆడటం మానేయాలని కోప్పడ్డారు. ఎన్ని విధాలుగా చెప్పినా అతడి వాళ్ల మాటలను పట్టించుకోలేదు.
దీంతో తల్లిదండ్రులు చేసేదేంలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. ఈ క్రమంలోనే అంకిత్ మానసిక స్థితి రోజురోజుకు క్షీణించి విచక్షణ కోల్పోయాడు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం సొంత తండ్రిని పెద్ద కర్నతో దాడి చేసి చంపేశాడు. అనంతరం అతడిని స్విమ్మింగ్ పూల్ లో పడేశాడు. అడ్డొచ్చిన తల్లిని తీవ్రంగా కొట్టగా ఆమె స్పృహ కోల్పోయింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె కూడా మృతి చెందింది. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేసి తండ్రి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు.