- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
లారీని ఢీ కొన్న రెండు ప్రయివేట్ బస్సులు.. ఎంత మంది గాయపడ్డారంటే..

దిశ, అలంపూర్ : పొద్దు పొద్దుగాల పెను ప్రమాదం తప్పింది. బండలలోడుతో వెళ్తున్న లారీ జాతీయ రహదారి పై యూటర్న్ తీసుకుంటుండగా రెండు బస్సులు వచ్చి ఢీ కొన్నాయి. ఈ సంఘటనలో ఓ డ్రైవర్ కాళ్లకు తీవ్ర గాయాలు కాగా.., మరో ఆరుగురికి గాయాలు అయినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండల పరిధిలోని టోల్ ప్లాజా సమీపంలో జాతీయ రహదారి పై బండలలోడుతో వెళ్తున్న లారీ యూటర్న్ తీసుకుంటుంది. సరిగ్గా అదే సమయానికి హైదరాబాద్ నుండి కడప వైపు వెళ్తున్న సీజీఆర్ ట్రావెల్ బస్సు ముందుగా ఢీ కొట్టింది. దాని వెనుకనే వస్తున్న కావేరి ట్రావెల్ బస్సు ముందు వెళ్తున్న సీజీఆర్ బస్సును బలంగా ఢీ కొట్టింది.
కావేరి ట్రావెల్ బస్సులో ముందు భాగం ధ్వంసం కావడంతో డ్రైవర్ చంద్రశేఖర్ కాళ్లకు బలమైన గాయాలు అయ్యాయి. అదే బస్సులో ఉన్న సమీర్, సావిత్రి, సంజీవ్, ప్రసాద్, రోహిత్, శ్రీధర్ లకు తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన 108 అంబులెన్స్ లో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఈఎంటీ రాధమోహన్, పైలెట్ దేవేందర్ తెలిపారు. సంఘటనా స్థలంకు పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంఘటన ఏ విధంగా జరిగిందో పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. లారీ డ్రైవర్ యూటర్న్ స్లోగా తీసుకుంటుండగా ఈ పరిస్థితి జరిగి ఉండొచ్చునని స్థానికులు తెలిపారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపించుకున్నారు.