పేకాట స్థావరంపై పోలీసుల దాడి..

by Aamani |
పేకాట స్థావరంపై పోలీసుల దాడి..
X

దిశ, ఎల్కతుర్తి: పేకాట ఆడుతూ ఏడుగురు పట్టుబడిన సంఘటన ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఎల్కతుర్తి సీఐ పులి రమేష్, ఎస్ఐ రాజ్ కుమార్ బుధవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నమ్మదగిన సమాచారం మేరకు ఎస్సై దామెర గ్రామంలోని సమ్మక్క గద్దె వద్ద ఖాళీ స్థలంలో రైడ్ చేయగా పేకాట ఆడుతున్న ఏడుగురిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచిరూ. 18,300 నగదు,మూడు ద్విచక్ర వాహనాలు,ఒక ఆటో స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

నిందితుల వివరాలిలా ఉన్నాయి. చిట్టంపల్లి సాయి కిరణ్ s/o జేమ్స్ రత్నగిరి గ్రామం, అంబాల రాజు s/o బుచ్చయ్య, అంబాల నిఖిల్ s/o రమేష్, మాటూరి కిషన్ s/o పోచయ్య, కడారి అనిల్ s/o చంద్రమౌళి. ఈ నలుగురు ఎల్కతుర్తి గ్రామానికి చెందినవారు. కడారి హరీష్ s/o వీరస్వామి, కల్లూరి శ్రీనివాస్ s/o తిరుపతి దామెర గ్రామానికి చెందినవారు. ఇల్లందుల పునీందర్ s/o కొమురయ్య ఎల్కతుర్తి గ్రామం. ఒర్సు శ్రీనాథ్ s/o కొమురయ్య కొప్పూర్ గ్రామం. వీరిద్దరూ పరారీలో ఉన్నారు హెడ్ కానిస్టేబుల్ బి. విఠల్రావు, బుచ్చి లింగం, కానిస్టేబుల్ తిరుపతి, రంజిత్, సుమన్ నిందితులను పట్టుకోవడంలో సహకరించారు.

Advertisement

Next Story