యూట్యూబర్ హర్షసాయి కోసం పోలీసుల గాలింపు

by Gantepaka Srikanth |
యూట్యూబర్ హర్షసాయి కోసం పోలీసుల గాలింపు
X

దిశ, వెబ్‌డెస్క్: యూట్యూబర్ హర్ష సాయి(YouTuber Harsha Sai) కోసం పోలీసులు గాలిస్తున్నారు. గత రెండ్రోజులు హర్ష సాయితో పాటు ఆయన కుటుంబసభ్యులు కూడా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఆయనపై హత్యాచారం కేసు నమోదైంది. మత్తు మందు ఇచ్చి రేప్ చేశాడని బాధితురాలు నార్సింగి పోలీసుల(Narsinghi Police)కు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నాలుగు బృందాలు ఆయన కోసం గాలిస్తున్నాయి. మరోవైపు ఈ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

ఇప్పటికే బాధితురాలుకు వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు.. హర్ష సాయికి సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు. మరోవైపు న్యాయపరంగా పోరాటం చేస్తామని హర్ష సాయి తరపు న్యాయవాదులు చెబుతున్నారు. డబ్బుల కోసమే హర్ష సాయిపై అక్రమ కేసులు పెట్టారని అన్నారు. ఇదిలా ఉండగా.. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి హర్ష మోసం చేశాడని యువతి ఆరోపిస్తోంది. ప్రేమ, పెళ్లి పేరుతో లొంగదీసుకుని నగ్న వీడియోలను, నగ్న చిత్రాలను పెట్టుకుని బ్లాక్మెయిల్ చేశారని.. పలుమార్లు తనపైన అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. అలాగే దాడి కూడా చేశాడని బాధితురాలు వాపోయింది.

Advertisement

Next Story

Most Viewed