- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కుంభమేళాలో జగిత్యాల వాసులు మిస్సింగ్

దిశ, జగిత్యాల ప్రతినిధి : జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఇద్దరు మహిళలు కుంభమేళాకు వెళ్లి మిస్ అయ్యారు. కొద్దిరోజుల క్రితం జగిత్యాల పట్టణంలోని కొత్తవాడకు చెందిన ఆది రాజవ్వ (55), విద్యానగర్ కు చెందిన వీర్ల నరసవ్వ (55) తో పాటు జగిత్యాలకు చెందిన మరో 8 మంది, నిర్మల్ జిల్లా కడెం మండలానికి చెందిన ఇద్దరు మహిళలు మొత్తం 12 మంది కుంభమేళాకు వెళ్లారు.
అయితే వీరిలో జగిత్యాల కు చెందిన ఇద్దరితో పాటు, కడెం కు చెందిన ఇద్దరు వృద్దులు కుంభమేళాలో తప్పిపోయారు. మిస్సింగ్ అయిన నలుగురు కూడా 55 సంవత్సరాల పైబడిన వారు కావడంతో వారి ఆచూకీ వెతకడం కష్టంగా మారింది. వీరికి చెందిన సెల్ ఫోన్లు కూడా మిగిలిన 8 మంది దగ్గరే ఉండడం కారణంగా కాంటాక్ట్ పూర్తిగా మిస్ అయింది. వీరితోపాటు వెళ్లిన వారి ద్వారా విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. వీర్ల నర్సవ్వ, ఆది రాజవ్వ కుటుంబ సభ్యులు హుటాహుటిన ఉత్తర ప్రదేశ్ బయలుదేరి వెళ్లారు. కాగా వీరందరూ ఒకే కుటుంబానికి చెందిన బంధువులుగా తెలుస్తుంది.