- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
చెట్టుపై నుంచి జారిపడి ఒకరి మృతి
by Shiva |

X
దిశ, ముత్తారం : చెట్టుపై నుంచి జారిపడి ఒకరు మృతి చెందిన ఘటన ముత్తారం మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన పేయ్యల చంద్రయ్య (62) తన ఇంటి వద్ద ఉన్న చెట్టు నరకడాకి చెట్టు పైకి ఎక్కాడు. ఈ క్రమంలోనే అతను ప్రమాదవశాత్తు కాలుజారి చెట్టుపై నుంచి కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో చంద్రయ్యకు తీవ్ర గాయాలు కాగా కుటుంబ సభ్యులు హుటాహుటిన అతడిని కరీంనగర్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచార మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బేతి రాములు తెలిపారు.
Next Story