ఇష్టం లేని పెళ్లి చేయడంతో నవ వధువు ఆత్మహత్య..

by Aamani |   ( Updated:2025-03-25 15:40:32.0  )
ఇష్టం లేని పెళ్లి చేయడంతో  నవ వధువు ఆత్మహత్య..
X

దిశ,బాన్సువాడ : పెళ్లి ఇష్టం లేక ఉరి వేసుకుని ఆత్మహత్యకు యువతి పాల్పడింది. బాన్సువాడ మండలంలోని కొల్లూరు గ్రామంలో విషాద ఘటన జరిగింది. ఫిబ్రవరి 23న పెళ్లి మార్చి 25న కనిపించని లోకానికి వెళ్ళింది. కుటుంబ సభ్యులు అమ్మాయి అభిప్రాయం తెలుసుకోకుండా పెళ్లి ఇష్టం లేదని తల్లిదండ్రులకు చెప్పినప్పటికీ వినిపించుకోకుండా పెళ్లి చేయడంతో నెల రోజులకే ఆ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. బాన్సువాడ మండలం, కొల్లూరు గ్రామంలో వళ్లేపు లక్ష్మి వెంకటేష్ లకు గత నెల 23న వివాహం జరిగింది. పెళ్లి ఇష్టం లేక ఈ రోజు ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. హుటాహుటిన ఇంట్లో వాళ్ళు చూడడంతో వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందిందని బాన్సువాడ ఏరియా ఆసుపత్రి డాక్టర్ తెలిపారు. తల్లి వల్లేపు చంద్రకళ ఫిర్యాదు మేరకు బాన్సువాడ సీఐ అశోక్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Next Story