MLC Pochampally: కోడిపందెల కేసులో కీలక పరిణామం.. విచారణకు హాజరైన ఎమ్మెల్సీ పోచంపల్లి

by Shiva |   ( Updated:2025-03-14 06:52:11.0  )
MLC Pochampally: కోడిపందెల కేసులో కీలక పరిణామం.. విచారణకు హాజరైన ఎమ్మెల్సీ పోచంపల్లి
X

దిశ, వెబ్‌డెస్క్/మొయినాబాద్: ఫామ్‌హౌజ్‌లో క్యాసినో, కోడిపందేల నిర్వహణ కేసులో గురువారం రెండో సారి నోటీసులు అందుకున్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి (Pochampally Srinivas Reddy) ఇవాళ మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. కాగా, ఫిబ్రవరి 11 మొయినాబాద్ పరిధిలోని తోల్‌కట్ట (Tolkatta) శివారులో ఉన్న ఫామ్‌హౌజ్‌లు కోడి పందేలు జరుగుతున్నాయని ఎస్‌వోటీ పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు ఫామ్‌హౌజ్‌పై వారు మెరుపు దాడి చేసి మొత్తం క్యాసినో (Casino), కోడి పందేల్లో పాల్గొన్న వారితో పాటు నిర్వాహకులతో కలిపి మొత్తం 64 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.30 లక్షల మేర నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఈ నేపథ్యంలోనే ఆ ఫామ్‌హౌజ్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిగా తేలడంతో ఆయనకు మొయినాబాద్ పోలీసులు ఆయనను విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. అయితే, ఆ ఫామ్ హౌజ్ తనదేనని, కానీ తాను మరో వ్యక్తికి లీజుకిచ్చానని ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అదేవిధంగా లీజ్‌కు సంబంధించి డాక్యుమెంటన్లకు పోలీసులకు హ్యాండోవర్ చేశారు. ఇచ్చిన డాక్యుమెంట్లపై అనుమానాలు రేకెత్తడంతో మరోసారి విచారణకు హాజకావాలని పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి గురువారం పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ విచారణ నిమిత్తం ఆయన మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌కు చేరకున్నారు. ఈ మేరకు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని సీఐ పవన్ కుమార్ రెడ్డి ప్రశ్నించనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీపై Cruelty to Animals Act-1960లోని సెక్షన్ 11 ప్రకారం కేసు నమోదైంది.

Next Story

Most Viewed