- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
యువకున్ని పదునైన ఆయుధాలతో చంపిన మావోయిస్టులు.. కారణమిదే..!
by Sathputhe Rajesh |

X
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఇన్ఫార్మర్ అన్న అనుమానంతో మావోయిస్టులు ఓ యువకున్ని హతమార్చారు. ఈ విషాదం బీజాపూర్ జిల్లా తరేం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. తురేపార్ గ్రామానికి చెందిన ఆవలం హెడ్మా అనే యువకుడు తోటి గ్రామస్తులతో కలిసి కట్టెలు కొట్టుకురావటానికి సోమవారం మధ్యాహ్నం దగ్గరలోని అటవీ ప్రాంతానికి వెళ్లాడు. ఆ సమయంలో మావోయిస్టులు అతన్ని తమతోపాటు తీసుకెళ్లారు. అదే రోజు రాత్రి పదునైన ఆయుధాలతో హెడ్మాను చంపారు. అనంతరం మృతదేహాన్ని పోలీస్ స్టేషన్‌కు కిలోమీటర్ దూరంలో వదిలేసి వెళ్లిపోయారు.
Next Story