- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాముకాటుకు గురై చికిత్స పొందుతూ వ్యక్తి మృతి..
by Kalyani |
X
దిశ, పాపన్నపేట : పాముకాటుకు గురై చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల కేంద్రమైన పాపన్నపేటలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. పాపన్నపేటకు చెందిన పెద్ద కటికె నబీసాబ్ (36) వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నెల 23న జీవాలను మేపడానికి బయటకు వెళ్ళగా గ్రామ శివారులో పాము కరిచింది. దీంతో ఇంట్లో వారికి చెప్పడంతో వారు చికిత్స కోసం మెదక్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం గురువారం సాయంత్రం గాంధీ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడి అన్న షాదుల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
Advertisement
Next Story